కామారెడ్డిలో కలకలం రేపుతున్న చిన్నారుల అదృశ్యం

  • రెండు రోజుల్లో ఐదుగురు చిన్నారులు అదృశ్యం
  • నిన్న ఇద్దరు, ఈరోజు ముగ్గురుఅక్కాచెల్లెల్లు మిస్సింగ్
  • సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తెలంగాణలోని కామారెడ్డిలో రెండు రోజుల్లో ఐదుగురు చిన్నారులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అదృశ్యమైన వారంతా పదేళ్ల లోపు చిన్నారులే. శుక్రవారం ఇద్దరు, ఈరోజు మరో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఐదుగురు పిల్లలు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారంతా కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

నిన్న పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన పదేళ్ల సింహాద్రి, తొమ్మిదేళ్ల విజయ్ కనిపించకుండా పోయారు. ఈరోజు ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సీపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) అదృశ్యమయ్యారు. ఈ ముగ్గురు పిల్లలు తండ్రి ఆటోలో దుకాణానికి వెళ్లారు. తండ్రి వారిని దుకాణం వద్ద దింపి కిరాయికి వెళ్లాడు. కానీ ముగ్గురు ఆ తర్వాత కనిపించలేదు.

Kamareddy
Kamareddy children missing
Telangana children missing
Missing children Telangana

More Telugu News